AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phones: ఈ 4 కంపెనీల స్మార్ట్‌ఫోన్స్‌ కేవలం రూ.1000లకే కొనుగోలు చేయొచ్చు..! ఎలాగంటే..

Smart Phones: భారతీయ మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లు, విభిన్న ధరలను కలిగి ఉన్నాయి. ఈ

Smart Phones: ఈ 4 కంపెనీల స్మార్ట్‌ఫోన్స్‌ కేవలం రూ.1000లకే కొనుగోలు చేయొచ్చు..! ఎలాగంటే..
108mp Camera Phone
uppula Raju
|

Updated on: Oct 20, 2021 | 4:10 PM

Share

Smart Phones: భారతీయ మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లు, విభిన్న ధరలను కలిగి ఉన్నాయి. ఈ మొబైల్స్‌ అన్నీ 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. ఈ ఫోన్‌లన్నింటినీ సులభ వాయిదాలలో అంటే నెలకు వేయి రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లన్ని Redmi, Realme, Motorola, Xiaomi Mi బ్రాండ్‌లకి సంబంధించినవి. ఇందులో ఒక ఫోన్ మాత్రమే 5G వరకు సపోర్ట్ చేస్తుంది.

Realme 8 ప్రో Realme కంపెనీ ఈ సంవత్సరం Realme 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక కెమెరా108 మెగాపిక్సెల్స్. అలాగే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్. మిగిలిన రెండు కెమెరాలు 2-2 మెగాపిక్సెల్స్. 8 GB RAM వేరియంట్ ధర రూ.19,999. కానీ దీనిని HDFC కార్డ్ సహాయంతో కేవలం రూ .970 సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. ఇది 24 నెలల పాటు కొనసాగుతుంది.

మోటరోలా Moto G60 ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్120hz. ఇది 6.78 అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.16999. దీనిలో 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. HDFC బ్యాంక్ కార్డ్ సహాయంతో దీనిని రూ.825 కి కొనుగోలు చేయవచ్చు.

Redmi10 ప్రో మాక్స్ రెడ్‌మి కూడా తన స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. దీని ధర రూ.21999. HDFC కార్డ్ సహాయంతో దీనిని రూ.1067 సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. ఇది 24 నెలల పాటు ఉంటుంది. ఈ ధరలో 6 GB RAM, 128 GB వేరియంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది వెనుక ప్యానెల్‌లోనాలుగు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో ఫస్ట్ కెమెరా 108 మెగాపిక్సెల్స్. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్, మూడో కెమెరా 5 మెగాపిక్సెల్స్, నాలుగో కెమెరా 2 మెగాపిక్సెల్స్ ఉంటుంది. అలాగే ఇందులో16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో కంపెనీ 5020mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్‌ను ఇచ్చింది.

Mi 10i 5G మీరు108 మెగాపిక్సెల్ కెమెరాతో 5G సపోర్ట్ ఉన్న ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు Mi 10i ని ఎంచుకోవచ్చు. ఇది అమెజాన్‌లో లిస్ట్ చేయబడింది. దీని ధర రూ.21999. దీనిలో 6 GB RAM ఉన్న వేరియంట్ అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక కెమెరా108 మెగాపిక్సెల్స్. అలాగే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4820 mAh బ్యాటరీని కలిగి ఉంది. హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ సహాయంతో దీనిని రూ.1,067 సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. ఇది 24 నెలల పాటు కొనసాగుతుంది.

YS Sharmila: తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే.. నా ముక్కు నేలకు రాస్తా: వైఎస్ షర్మిల

తల్లిదండ్రులు అలర్ట్..! మీ పిల్లలు ఈ సమస్యలతో బాధపడుతున్నారా..?

Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..