AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman: నోరు జారి నాలుక కరచుకున్న నిర్మలమ్మ.. ప్రతిపక్షాల చేతికి విమర్శనాస్త్రాలు ఇచ్చి..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఐదో బడ్జెట్‌. సాధారణంగా ప్రచారానికి చాలా దూరంగా ఉండే ఆర్థిక మంత్రి,

Nirmala Sitharaman: నోరు జారి నాలుక కరచుకున్న నిర్మలమ్మ.. ప్రతిపక్షాల చేతికి విమర్శనాస్త్రాలు ఇచ్చి..
Nirmala Sitharaman Trolls
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 01, 2023 | 9:52 AM

Share

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఐదో బడ్జెట్‌. సాధారణంగా ప్రచారానికి చాలా దూరంగా ఉండే ఆర్థిక మంత్రి, ఆమె ప్రకటనల కారణంగా అప్పుడపుడు హెడ్‌లైన్స్‌లో లేదా ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారిపోతుంటారు. వివాదాలకు కారణమైన ఆర్థిక మంత్రి ప్రకటనలు మనకు తెలిసినవే.. వాటిలో కొన్నిటిని బడ్జెట్ డే సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..

డాలర్ బలపడుతోంది, రూపాయి పతనం కాలేదు..

నిర్మల ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ చాలాసార్లు క్షీణించింది. రూపాయి ఇప్పటివరకు చరిత్రలో కనిష్ట స్థాయికి చేరుకుంది. ఒక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 రూపాయలకు చేరుకుంది. నిర్మలా సీతారామన్ 2022లో అమెరికా పర్యటనలో ఉన్నారు, అక్కడ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గురించి ఒక విలేకరి ఆమెను ప్రశ్నించారు. ‘రూపాయి బలహీనపడకుండా డాలర్ బలపడుతున్నట్లు నేను చూస్తున్నాను’ అని ఆర్థిక మంత్రి సమాధానం. ఈ ప్రకటనపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు.

కోవిడ్ మహమ్మారి ‘యాక్ట్ ఆఫ్ గాడ్’..

కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం కష్టాల్లో పడింది. భారతదేశంలో కూడా, కరోనా విషయంలో ఒకసారి ప్రభుత్వ నిర్వహణ లోపం కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. 2020లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఉపాధి, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక మంత్రి కోవిడ్‌ను నిందించారు – ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ‘దేవుని చర్య’గా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనపై విపక్షాలే కాకుండా ట్విట్టర్‌లో ప్రజలు ఆమె పై విరుచుకుపడ్డారు. చాలా మంది వినియోగదారులు ఇది ‘ఆక్ట్ ఆఫ్ గాడ్’ అయితే, ప్రభుత్వానికి ఏమి అవసరం అని అన్నారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్ట నిర్వహణను ఎలా వివరిస్తారని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి.

నేను శాఖాహారిని, ఉల్లిపాయలు తినను..

2019లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లిగడ్డ పెరిగిన ధరలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పేందుకు లేచి నిలబడ్డారు. సమాధానం చెప్పే ముందు.. ఉల్లికి సంబంధించిన ప్రశ్నపై కొందరు ఎంపీలకు సమాధానమిస్తూ.. ‘నేను అంత వెల్లుల్లి, ఉల్లి తినను. నేను ఉల్లిపాయలను పట్టించుకోని ఇంటి నుండి వచ్చాను’. అంటూ చెప్పారు. అంతే ఆమె ప్రకటనపై మీమ్స్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి.

హిందీ-సంస్కృతం కారణంగా స్కాలర్‌షిప్ అందుబాటులో లేదు..

నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి వచ్చారు. అక్కడ నుండి గ్రాడ్యుయేషన్ వరకు చదువు సాగించారు. ఎంఏ-ఎంఫిల్ చదువుల కోసం జేఎన్‌యూకి వెళ్లారు. దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు హిందీ అంతగా రాదు.

గత ఏడాది తన హిందీ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ తాను చాలా సంకోచంగా హిందీ మాట్లాడతానని చెప్పింది. దీంతో పాటు హిందీ వ్యతిరేక ఆందోళనల మధ్య కాలేజీ చదువులు సాగాయి. ఒక విద్యార్థి పాఠశాలలో హిందీ-సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్నా, అతనికి స్కాలర్‌షిప్ రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆమె ప్రకటనపై ఓ వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..