Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shaastra: ఇంట్లో శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..? ఆరోగ్యానికి కూడా..

శంఖాన్ని కీర్తి, సంవృద్ధి, దీర్ఘాయుష్షు కోసం పూజిస్తారు. శంఖంలోని ప్రతి భాగం దేవతల నివాసంగా చెప్తారు. శంఖం ఊదటం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు వదిలిపోతాయని నమ్ముతారు. నిజానికి శంఖం మతపరంగానే కాదు.. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

Vastu Shaastra: ఇంట్లో శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..? ఆరోగ్యానికి కూడా..
Shankh Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 01, 2023 | 7:48 AM

వాస్తు శాస్త్రం: వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ శంఖం శబ్దం ప్రతిధ్వనిస్తుంటే మీ ఇంట్లో పెద్ద మార్పును గమనిస్తారు. రోజూ రెండు నుంచి నాలుగు సార్లు శంఖం ఊదడం వల్ల మీ ఇంటి వాతావరణం సానుకూల శక్తితో నిండుకుంటుంది. అందుకే మన ఇంట్లో శంఖం తప్పకుండా పెట్టుకోవాలని అంటారు. హిందూ మతంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో శంఖాన్ని ఉంచడం ద్వారా మీరు ఇంటి లోపల పెద్ద ప్రభావాన్ని గమనిస్తారు. శంఖాన్ని పూజించడం వల్ల మీలో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన 14 రత్నాలలో శంఖం ఒకటని నమ్ముతారు. అందుకే శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ మతంలో శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభ కార్యక్రమమైనా, మతపరమైన ఆచారాలైనా శంఖం ఊదడం ఆనవాయితీ.

రోజూ శంఖం ఊదిన ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. శంఖం ధ్వని నుండి ఓంకార శబ్దం వస్తుంది. దీని వల్ల వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. దీని ధ్వని చుట్టూ వ్యాపించిన ప్రతికూల శక్తిని కూడా నాశనం చేస్తుంది. శంఖంలో నీటిని నింపి ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి. ఇంట్లో నివసించే ప్రతికూల శక్తి దీనితో ముగుస్తుంది. తరచూ గొడవలు జరిగే ఇళ్లలో కూడా శాంతి కలుగుతుంది. అంతే కాకుండా వాస్తు దోషాలు కూడా ఇళ్ల నుంచి దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ప్రతిరోజూ శంఖం ఊదితే, ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు బలపడుతుంది. పురాణాల ప్రకారం, శంఖం, లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి ఉద్భవించింది. దాని కారణంగా శంఖం,లక్ష్మిదేవి తోబుట్టువులు అని చెబుతారు. ఇది కాకుండా, శంఖం విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. ఇది ఎల్లప్పుడూ విష్ణుమూర్తి చేతుల్లోనే ఉంటుంది. అందుకే శంఖం కలిగిన ఇల్లు, ఆ ఇంటి సభ్యులు చాలా అదృష్టవంతులు అంటారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

శంఖం ఊదడం ద్వారా మీ శరీరం కూడా గొప్ప ప్రయోజనాలను పొందుతుంది. ఇది మీ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. శంఖం ఊదడం వల్ల అనేక ప్రయోజనాలను కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..