AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Medaram Jatara: మేడారం మినీ జాతరకు సర్వసిద్ధం.. నేడు మండమెలిగే పండువ.. పోటెత్తిన భక్తులు

ఇవాళ్టి నుంచి మేడారం మినీ జాతర మొదలు. భారీ ఎత్తున వస్తోన్న భక్త జనులు. జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.  

Mini Medaram Jatara: మేడారం మినీ జాతరకు సర్వసిద్ధం.. నేడు మండమెలిగే పండువ.. పోటెత్తిన భక్తులు
Mini Medaram Jatara
Surya Kala
|

Updated on: Feb 01, 2023 | 7:23 AM

Share

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో మినీ జాతరకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నాలుగోతేదీ వరకూ జరిగే మినీ వన జాతరను సైతం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన జాతర ఘనంగా జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీజాతర పేరిట గద్దెలను శుద్ధి చేస్తారు. రెండేళ్లకోసారి జరిగే ప్రధాన జాతరకు ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వస్తారు. మినీ జాతరకు మాత్రం కేవలం మేడారం చుట్టుపక్కల గిరిజనులు మాత్రమే వస్తారు. కానీ కాలక్రమంలో మినీ జాతరకు కూడా భారీగా పోటెత్తుతున్నారు భక్త జనులు. దీంతో ఈ మినీ జాతరను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడకు భారీగా తరలి వచ్చారు భక్తులు. మొత్తం ముప్పై లక్షల మంది వరకూ వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో మినీ జాతరకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించ‌నున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు