Budget 2022: పార్లమెంట్‌లో నిర్మలమ్మ బడ్జెట్.. 9 ముఖ్యమైన ప్రతిపాదనలు ఇవే!

మాన్యుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నిర్మలమ్మ తన పద్దుల్ని పార్లమెంట్ లో ప్రవేశాపెట్టేశారు. సాధారణంగా బడ్జెట్ అంటే కొంత ఖేదం మరికొంత మోదం ఉంటుంది. ఈసారి బడ్జెట్ కూడా దాదాపుగా రెండిటి మిశ్రమంగానే ఉంది.

Budget 2022: పార్లమెంట్‌లో నిర్మలమ్మ బడ్జెట్.. 9 ముఖ్యమైన ప్రతిపాదనలు ఇవే!
Nirmala
Follow us
KVD Varma

|

Updated on: Feb 01, 2022 | 2:24 PM

Budget 2022: మాన్యుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నిర్మలమ్మ తన పద్దుల్ని పార్లమెంట్ లో ప్రవేశాపెట్టేశారు. సాధారణంగా బడ్జెట్ అంటే కొంత ఖేదం మరికొంత మోదం ఉంటుంది. ఈసారి బడ్జెట్ కూడా దాదాపుగా రెండిటి మిశ్రమంగానే ఉంది. అయితే, పెద్దగా ఎవరికీ అనుకూలంగానూ లేదా ప్రతికూలంగానూ లేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా బడ్జెట్ పై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగకపోయినా.. స్థూలంగా చూస్తె.. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 39.45 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత బడ్జెట్ కంటే 4.5% ఎక్కువ. ఇక ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 9 ముఖ్యాంశాలు ఏమిటో పరిశీలిద్దాం..

1.డిజిటల్ రుపీ:

క్రిప్టో కరెన్సీ లా ఆర్బీఐ డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనుంది. ఆర్‌బీఐ 2022-23లో డిజిటల్ కరెన్సీని తీసుకువస్తుంది. ఈ RBI డిజిటల్ రూపాయి డిజిటల్ కరెన్సీగా పనిచేస్తుంది ఇది డిజిటల్ లావాదేవీలను మరింత పెంచుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ వాతావరణాన్ని పెంచుతుంది.

2.క్రిప్టో పన్ను 30శాతం:

అందరూ ఊహిస్తున్నట్టుగానే ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ పై పన్ను పోటు వేసింది. డిజిటల్ ఆస్తుల బదిలీపై 30% పన్ను విధిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదించారు. దీంతోపాటు క్రిప్టో, NFT లను డిజిటల్ ఆస్తులుగా పరిగణించారు. ఇది క్రిప్టో కరెన్సీని మరింత ప్రియం చేస్తుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తుంది.

3.ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5జీ వేలం.. సేవలు అందుబాటులోకి..

ఈ ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. దీంతో 5G సేవలు ఈ సంవత్సరం ప్రారంభించె అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ చేరుకోవడానికి ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

4.ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ – పాస్‌పోర్టులు

చిప్ పొందుపరిచిన ఈ పాస్ పోర్ట్ 2023 నుంచి అందుబాటులోకి వస్తుంది. దీంతో పాస్‌పోర్ట్ పొందడం సులభం అవుతుంది. విదేశాలకు వెళ్లడం సులభం అవుతుంది. అదేవిధంగా పాస్ పోర్ట్ ట్రాకింగ్ కూడా సులభంగా మారుతుంది

5. పన్ను మినహాయింపు పరిమితి యధాతథం

ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని అందరూ ఆశించారు. అయితే, ఆ ఆశలపై ఆర్ధిక మంత్రి నీళ్ళు చల్లారు. ఎటువంటి పన్ను మినహాయింపు పరిమితినీ ప్రకటించలేదు. దీంతో పన్ను మినహాయింపు పరిమితి యధాతథంగా ఉండనుంది. ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. ఇది ₹2 లక్షల నుంచి ₹2.5 లక్షల.. సీనియర్ సిటిజన్‌లకు ₹3 లక్షలకు పెంచారు.

6. 80 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు, 60 లక్షల కొత్త ఉద్యోగాలు

ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మిచాలని ప్రతిపాదించారు. ఇది పేదలకు మేలు చేస్తుంది. అదే సమయంలో కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. ఇది నిరుద్యోగులకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

7. ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ..

ఎల్ఐసి (LIC) మార్చి, 2022 నాటికి పబ్లిక్ ఇష్యూకి వస్తుందని అంచనా వేస్తున్నారు. భుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలోఇది సహకరిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు.గా ఉంది.

8. 400 వందేమాతరం రైళ్లు మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో సులభంగా అనేక నగరాలకు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇది రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగడానికి సహాయపడుతుంది. రైల్వేలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

9.డిజిటల్ యూనివర్సిటీ ప్రభుత్వం కొత్తగా వన్ క్లాస్ వన్ టీవీ ప్రోగ్రామ్ ప్రకటించింది. దీనిలో భాగంగా అనుబంధ విద్యలో రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుంది. బహుభాషా విద్యా కంటెంట్ ప్రభుత్వం ప్రచురిస్తుంది. డిజిటల్ సాధనాలపై దృష్టిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి: Digital Rupee: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ

Budget 2022: ఈ ఏడాది నుంచి అందుబాటులోకి 5జీ సేవలు.. మారుమూల ప్రాంతాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!