వైసీపీలో చేరిపోండి స్వామీజీ: యామిని

వైసీపీలో చేరిపోండి స్వామీజీ: యామిని

విజయవాడ: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు పెడతాననడమేంటని ప్రశ్నించారు. పీఠాధిపతిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదంటూ విమర్శలు చేశారు. అసలు స్వామీజీలకు రాజకీయాలతో పనేంటని, భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన వారు రాజకీయాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఒకవేళ రాజకీయాలపై ఆసక్తి ఉంటే పీఠాధిపతి పదవిని వదిలేసి వైసీపీలో చేరాలంటూ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో స్వరూపానందేంద్ర స్వామి […]

Vijay K

|

Feb 18, 2019 | 6:14 PM

విజయవాడ: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు పెడతాననడమేంటని ప్రశ్నించారు. పీఠాధిపతిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదంటూ విమర్శలు చేశారు. అసలు స్వామీజీలకు రాజకీయాలతో పనేంటని, భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన వారు రాజకీయాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు.

ఒకవేళ రాజకీయాలపై ఆసక్తి ఉంటే పీఠాధిపతి పదవిని వదిలేసి వైసీపీలో చేరాలంటూ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో స్వరూపానందేంద్ర స్వామి సీరియస్‌గా స్పందిస్తూ చంద్రబాబుపై కేసు పెడతానన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ మార్పు కోసం రాజ శ్యామల యాగం చేస్తానని ప్రకటించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu