ఉక్రేనియన్ విమానం కూలి.. 180 మంది మృతి

ఇరాన్ రాజధాని   టెహరాన్‌లోని ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఈ ఉదయం ఉక్రేనియన్ విమానం కూలిపోగా.. 10 మంది ఫ్లైట్ సిబ్బందితో సహా 170 మంది ప్రయాణీకులు మరణించారు. సాంకేతిక సమస్యల కారణంగానే విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయల్దేరిన మూడు నిముషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద పేలుడుతో ఆకాశంలో మండుతూ ప్లేన్ కూలిన  దృశ్యాలతో కూడిన వీడియోను బీబీసీ సేకరించింది. బోయింగ్ 737-800 విమానం కూలిన విషయాన్ని  అధికారులు ధృవీకరించారు. ఈ […]

ఉక్రేనియన్ విమానం కూలి.. 180 మంది మృతి
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: Jan 08, 2020 | 2:15 PM

ఇరాన్ రాజధాని   టెహరాన్‌లోని ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఈ ఉదయం ఉక్రేనియన్ విమానం కూలిపోగా.. 10 మంది ఫ్లైట్ సిబ్బందితో సహా 170 మంది ప్రయాణీకులు మరణించారు. సాంకేతిక సమస్యల కారణంగానే విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయల్దేరిన మూడు నిముషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద పేలుడుతో ఆకాశంలో మండుతూ ప్లేన్ కూలిన  దృశ్యాలతో కూడిన వీడియోను బీబీసీ సేకరించింది. బోయింగ్ 737-800 విమానం కూలిన విషయాన్ని  అధికారులు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని వారు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.