నెలాఖరున లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం: జెట్టి

హైదరాబాద్:  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని.. అభ్యర్థుల ఎంపికలో ఒకటి, రెండు పేర్లు మాత్రమే అధిష్టానానిక పంపుతామని ఆయన అన్నారు. పార్లమెంట్ […]

నెలాఖరున లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం: జెట్టి

హైదరాబాద్:  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని.. అభ్యర్థుల ఎంపికలో ఒకటి, రెండు పేర్లు మాత్రమే అధిష్టానానిక పంపుతామని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించనుందని.. ఈ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందని జెట్టి ధీమా వ్యక్తం చేశారు.

Published On - 3:54 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu