హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరు అయ్యారు. బీసీ గర్జన సభ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్, గర్జన సభ గురించి నేతలతో ఆయన చర్చిస్తున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించబోతుంది. బీసీలను ఎలా ఆదుకోబోతున్నారు, వారి ఉన్నతికి […]
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరు అయ్యారు. బీసీ గర్జన సభ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్, గర్జన సభ గురించి నేతలతో ఆయన చర్చిస్తున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించబోతుంది. బీసీలను ఎలా ఆదుకోబోతున్నారు, వారి ఉన్నతికి తీసుకురానున్న ప్రొగ్రామ్స్ ఈ గర్జన సభలో వైఎస్ జగన్ ప్రకటించనున్నారు.