టిక్‌టాక్ ఎఫెక్ట్: చపాతి కర్రతో.. భార్య హత్య..! అసలేం జరిగింది..?
పచ్చని సంసారంలో టిక్‌టాక్ చిచ్చుపెట్టింది.. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది.. చివరకు ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతమయ్యేలా చేశాయి. దీంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రకాశంజిల్లా కనిగిరిలో జరిగిన ఈ సంఘటన టిక్‌టాక్ వీడియోల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాన్ని మరోసారి బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే..? ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచ్చూ.. నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్లూరుకు […]
పచ్చని సంసారంలో టిక్‌టాక్ చిచ్చుపెట్టింది.. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది.. చివరకు ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతమయ్యేలా చేశాయి. దీంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రకాశంజిల్లా కనిగిరిలో జరిగిన ఈ సంఘటన టిక్‌టాక్ వీడియోల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాన్ని మరోసారి బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే..?
ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచ్చూ.. నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్లూరుకు చెందిన ఫాతిమా టైలర్ పని చేసే పాచ్చును వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా భర్తతో ఫాతిమాకు విభేదాలు ఏర్పడ్డాయి. భార్య ఫాతిమకు వివాహేతర సంబంధం ఉందనీ, నగదు కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ.. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తుందనే కారణంతో ఇరువురు తరచూ గొడవపడుతుంటారు. రెండు నెలల క్రితం ఫాతిమాకు ఎంపీడీవో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం వచ్చింది. అంతే కాకుండా టిక్ టాక్‌లో తను ఆడుతూ, పాడుతూ చేసిన వీడియోలు అప్లోడ్ చేయడం ఆమెకు ఫ్యాషన్‌గా మారింది.
భర్త వద్దని వారిస్తున్నా అతని మాట వినకుండా టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసేది.. ఈ విషయంపై భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. కాగా.. అప్పటికే.. తన భార్యను అనుమానిస్తున్న పాచ్చూకి.. ఈ టిక్‌టాక్ వీడియోలు మరింత ఆజ్యం పోశాయి. ఆ అనుమనం పెనుభూతంలా మారి ఆమె హత్యకు దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాతిమా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మొదట చిత్రీకరించాడు భర్త పాచ్చూ. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. టిక్‌టాక్ వీడియోలు, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు ఆమె హత్యకు దారితీశాయని పోలీసులు నిర్ధారించారు. చపాతీ కర్రతో తలపై కొట్టి.. గొంతు నొక్కి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భర్త పాచ్చును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.
ఫాతిమా హత్యకు కారణం టిక్‌టాకేనని నిందితుడు సోదరులు చెబుతున్నారు. ఫాతిమాకు టిక్‌టాక్‌లో వీడియోలు చేసి అప్‌లోడ్ చేయడమంటే పిచ్చిగా మారిందంటున్నారు. అయితే తాము గౌరవమైన కుటుంబానికి చెందిన వారమని, సొసైటీలో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని పలుమార్లు ఫాతిమాకు నచ్చజెప్పినా ఆమె వినలేదని అన్నారు. దీంతో.. పాచ్చూకి కూడా ఆమెపై అనుమానం పెరిగిన నేపథ్యంలో గొడవ జరిగి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నామని నిందితుడి సోదరుడు చెప్పాడు.