చైనీస్‌ యాప్ టిక్‌టాక్.. ఇండియాకి చేస్తున్న సాయం ఇదే..!!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కూడా తన వంతు సాయంగా భారీ విరాళాన్ని ప్రకటించింది. దాదాపు రూ. 100 కోట్లతో నాలుగు లక్షల సేఫ్టీ సూట్లను మనదేశానికి అందించనున్నట్లు టిక్‌టాక్‌ వెల్లడించింది. గత వారం రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దేశంలో సేఫ్టీ సూట్స్‌ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయాన్ని గమనించిన చైనాకి […]

చైనీస్‌ యాప్ టిక్‌టాక్.. ఇండియాకి చేస్తున్న సాయం ఇదే..!!
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2020 | 10:30 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కూడా తన వంతు సాయంగా భారీ విరాళాన్ని ప్రకటించింది. దాదాపు రూ. 100 కోట్లతో నాలుగు లక్షల సేఫ్టీ సూట్లను మనదేశానికి అందించనున్నట్లు టిక్‌టాక్‌ వెల్లడించింది. గత వారం రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దేశంలో సేఫ్టీ సూట్స్‌ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయాన్ని గమనించిన చైనాకి చెందిన టిక్‌టాక్ సంస్థ.. భారత్‌కు సేఫ్టీ సూట్స్‌ అందించాలని నిర్ణయించిందని టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు.

అంతేకాదు.. భారత ప్రభుత్వానికి రాసిన లెటర్‌లో కూడా టాక్‌టాక్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం 20,675 సేఫ్టీ సూట్లను మొదటి విడత కింద పంపించినట్లు తెలిపింది. ఈ వారాంతానికి మరో 1,80,375 సూట్లను పింపిస్తామంటూ టిక్‌టాక్ యాజమాన్యం పేర్కొంది. ఇక మిగతా రెండు లక్షల సూట్లను కూడా రాబోయే రోజుల్లో అందిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాసిన లెటర్‌లో పేర్కొన్నారు.

కాగా.. గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ కేసులు దేశంలో విపరీతంగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన వారే ఈ పాజిటివ్‌ కేసులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Latest Articles