ఈ మొక్క చనిపోయినా.. మళ్లీ బ్రతికించొచ్చు..!

రోజ్ ఆఫ్ జెరీజో ఈ పేరును ఎప్పుడైనా విన్నారా..! అమెరికా, మెక్సికో ఎడారిలలో అరుదుగా కనిపించే ఈ మొక్క చనిపోతే మళ్లీ బ్రతికించొచ్చు. అందుకే దాన్ని ‘పునర్జీవ మొక్క’ అని పిలుస్తారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగల ఈ మొక్క తనను తాను బ్రతికించుకోవడం కోసం ఓ ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తుంది. పూర్తిగా నీరు లేని సమయంలో నిద్రాణ స్థితిలోకి వెళ్లే ఈ మొక్క తన కొమ్మలను లోపలికి తీసుకొని బంతివలే ముడుచుకుపోతుంది. ఆ సమయంలో మొక్కలో ఉండే […]

ఈ మొక్క చనిపోయినా.. మళ్లీ బ్రతికించొచ్చు..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 2:03 PM

రోజ్ ఆఫ్ జెరీజో ఈ పేరును ఎప్పుడైనా విన్నారా..! అమెరికా, మెక్సికో ఎడారిలలో అరుదుగా కనిపించే ఈ మొక్క చనిపోతే మళ్లీ బ్రతికించొచ్చు. అందుకే దాన్ని ‘పునర్జీవ మొక్క’ అని పిలుస్తారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగల ఈ మొక్క తనను తాను బ్రతికించుకోవడం కోసం ఓ ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తుంది.

పూర్తిగా నీరు లేని సమయంలో నిద్రాణ స్థితిలోకి వెళ్లే ఈ మొక్క తన కొమ్మలను లోపలికి తీసుకొని బంతివలే ముడుచుకుపోతుంది. ఆ సమయంలో మొక్కలో ఉండే ట్రెహాలోస్ అనే పదార్థం ఆ మొక్కకు బలాన్ని ఇస్తోంది. మామూలుగా నీరు లేకపోతే ఎడారి మొక్కలు కూడా కొన్ని నెలల్లోనే చనిపోతాయి అయితే ట్రోహాలోస్ వలన రోజ్ ఆఫ్ జెరీజోకు వర్షాభావ పరిస్థితులతో పాటు వాతావరణ స్థితులను తట్టుకోగలుగుతుంది.

ఈ క్రమంలో కాస్త నీరు తగిలితే చాలు మళ్లీ పునర్జీవాన్ని తెచ్చుకుంటుంది రోజ్ ఆఫ్ జెరీజో. పువ్వులాగా విరబూస్తూ పూర్వ రూపాన్ని తెచ్చుకుని మళ్లీ తన జీవితాన్ని కొనసాగిస్తుంది రోజ్ ఆఫ్ జెరీజో. ఇలా తనను బ్రతికించుకోవడం కోసం ఈ మొక్క అవలంభించే విధానం  శాస్త్రవేత్తలను ఆకట్టుకుంటోంది. కాగా ఈ మొక్క శాస్త్రీయ నామం సెలగినల్ల లెపిడోపైల్ల.