అభినందన్ కుటుంబం మొత్తం ఆర్మీలోనే..!
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అణువణువునా దేశభక్తి ఉంది. 34 ఏళ్ల అభినందన్ ఎన్టీయే గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆయన పూర్వికుల స్వస్థలం తమిళనాడులోని తిరుప్పన్నమూర్. 2004లో అభినందన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. 15 ఏళ్ల నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబమంతా ఎయిర్ ఫోర్స్‌ల్లోనే పనిచేస్తుంది. తండ్రి సింహకుట్టి వార్థమాన్ ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు. బటిండా, హల్వారా ఎయిర్ ఫోర్స్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నారు అభినందన్. సుఖోయ్ యుద్ధ విమానాలు నడపడంలో […]

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అణువణువునా దేశభక్తి ఉంది. 34 ఏళ్ల అభినందన్ ఎన్టీయే గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆయన పూర్వికుల స్వస్థలం తమిళనాడులోని తిరుప్పన్నమూర్. 2004లో అభినందన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. 15 ఏళ్ల నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబమంతా ఎయిర్ ఫోర్స్‌ల్లోనే పనిచేస్తుంది. తండ్రి సింహకుట్టి వార్థమాన్ ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు. బటిండా, హల్వారా ఎయిర్ ఫోర్స్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నారు అభినందన్. సుఖోయ్ యుద్ధ విమానాలు నడపడంలో ఎక్స్‌పర్ట్ అభినందన్.

వింగ్ కమాండర్‌గా ప్రమోషన్ పొందిన తరువాత అభినందన్ ఎంఐ 21 బైసన్ స్వ్కాడ్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అభినందన్ తల్లి డాక్టర్. అభినందన్ భార్య తన్వి కూడా ఎయిర్ ఫోర్స్‌లో స్క్కాడ్రన్ లీడర్ గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. అభినందన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభినందన్ సోదరుడు కూడా ఎయిర్ ఫోర్స్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని సైనిక్ వెల్ ఫేర్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది.
