దాడి జరిగింది మన భూభాగంలోనే..

దాడి జరిగింది మన భూభాగంలోనే..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలొస్తున్నాయి. అయితే పాక్ మాత్రం విభిన్నంగా స్పందించింది. సరిహద్దు రేఖను దాటి పాకిస్థాన్‌లోకి వచ్చిన భారత విమానాలను తిప్పి కొట్టామని చెప్పింది. భారత్ నిబంధనలను అతిక్రమించి తమ ప్రాంతంలోకి చొరబడిందని వాదిస్తోంది. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం ఏమంటుంది? ఐక్యరాజ్య సమితి ఎలా స్పందిస్తుంది? అనేది కీలకంగా […]

Vijay K

|

Feb 26, 2019 | 1:48 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలొస్తున్నాయి. అయితే పాక్ మాత్రం విభిన్నంగా స్పందించింది. సరిహద్దు రేఖను దాటి పాకిస్థాన్‌లోకి వచ్చిన భారత విమానాలను తిప్పి కొట్టామని చెప్పింది. భారత్ నిబంధనలను అతిక్రమించి తమ ప్రాంతంలోకి చొరబడిందని వాదిస్తోంది. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం ఏమంటుంది? ఐక్యరాజ్య సమితి ఎలా స్పందిస్తుంది? అనేది కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సందిగ్ధ పరిస్థితిపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దాడి జరిగింది మన భూభాగంలోనే అని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే అది మన భూభాగం కిందకే వస్తుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలను ఏరివేసే క్రమంలో రక్షణ చర్యల్లో భాగంగానే చూడాల్సి ఉంటుందని వివరించారు. పాక్‌ భూభాగంలో దాడి చేయలేదు కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ ఆయన తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu