విమానంలో బాంబు ఉందంటూ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్ కాల్
విమానం ఎక్కేందుకు ఆలస్యంగా వచ్చిన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్…విమానంలో బాంబు ఉందంటూ బెదిరిస్తూ ఫోన్ కాల్ చేసిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. సూరత్ నగరానికి చెందిన ప్రతీక్ అనే యువకుడు సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ప్రతీక్ తన భార్య, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం బెంగళూరుకు వచ్చారు. తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతీక్ బెంగళూరు నుంచి సూరత్ కు రాత్రి 7 గంటల విమానం ఎక్కాలి. కాని […]

విమానం ఎక్కేందుకు ఆలస్యంగా వచ్చిన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్…విమానంలో బాంబు ఉందంటూ బెదిరిస్తూ ఫోన్ కాల్ చేసిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది.
సూరత్ నగరానికి చెందిన ప్రతీక్ అనే యువకుడు సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ప్రతీక్ తన భార్య, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం బెంగళూరుకు వచ్చారు. తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతీక్ బెంగళూరు నుంచి సూరత్ కు రాత్రి 7 గంటల విమానం ఎక్కాలి. కాని ప్రతీక్ విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే బోర్డింగ్ మూసివేశారు. దీంతో ప్రతీక్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రాత్రి 6.57 నిమిషాలకు బెంగళూరు- సూరత్ ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. దీంతో ఉలిక్కిపడ్డ సీఐఎస్ఎఫ్ అధికారులు, ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది తనిఖీలు చేసి, బాంబు బెదిరింపుకాల్ ను ప్రతీక్ చేశాడని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన సమయంలో, ఫోన్ లో ప్రతీక్ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించారు. ప్రతీక్ ను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.