బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగో ఏట […]
ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉంది.
సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మాస్టర్, తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. హంగామా సినిమా ద్వారా వేణుమాధవ్ హీరోగా కూడా మారారు.