AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశ్మీర్ పై ఉగ్ర కన్ను.. ఈసారి టార్గెట్ ఎవరంటే ..?

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను మట్టుపెట్టేందుకు జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వెల్లడించింది. ముఖ్యులను మట్టుబెట్టడంతోపాటు కాశ్మీర్ లోని పది చోట్ల భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది. […]

కాశ్మీర్ పై ఉగ్ర కన్ను.. ఈసారి టార్గెట్ ఎవరంటే ..?
Rajesh Sharma
|

Updated on: Sep 25, 2019 | 1:46 PM

Share

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను మట్టుపెట్టేందుకు జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వెల్లడించింది. ముఖ్యులను మట్టుబెట్టడంతోపాటు కాశ్మీర్ లోని పది చోట్ల భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 9/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోమ్ శాఖా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది. టూరిస్ట్ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, కాశ్మీర్ నుండి ఢిల్లీకి చేరే రహదారులతో పాటు కీలక మార్గాలలో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ బేస్ తోపాటు దేశంలోని మరో మూడు ఎయిర్ బేస్ లకు భద్రతను పెంచారు. తాజా హెచ్చరిక గతంలో ఎన్నడూ లేనంత కీలక సమాచారం ఆధారంగా రావడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ పరిస్థితి కనిపిస్తోంది.

సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!