బ్రేకింగ్: సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు .. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చాటువుకుర్ గ్రామానికి చెందిన మహిళలు బాగమ్మ, చంద్రకళగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ […]
సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు .. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చాటువుకుర్ గ్రామానికి చెందిన మహిళలు బాగమ్మ, చంద్రకళగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ ఆటో అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే.