AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడం కక్ష సాధింపే.. వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్..

ఏపీలో సంచలనంగా మారిన ఐటీ రైడ్స్.. మెల్లిగా రాజకీయ రంగులను పులుముకొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఐటీ సోదాల్లో.. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 6 నుంచి నిర్వహించిన సోదాల్లో కీలక సమాచారం సేకరించామని ఐటీ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పూణె సహా దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అందులో పేర్కొన్నారు. మూడు ప్రముఖ […]

ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడం కక్ష సాధింపే.. వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 14, 2020 | 2:13 AM

Share

ఏపీలో సంచలనంగా మారిన ఐటీ రైడ్స్.. మెల్లిగా రాజకీయ రంగులను పులుముకొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఐటీ సోదాల్లో.. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 6 నుంచి నిర్వహించిన సోదాల్లో కీలక సమాచారం సేకరించామని ఐటీ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పూణె సహా దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అందులో పేర్కొన్నారు. మూడు ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు సంబంధించి 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

అయితే ఈ ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలొ మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడం వైసీపీ కక్ష సాధింపేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బురద జల్లేందుకే ఈ దాడులను అస్త్రంగా చేసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న ఆయన.. జగన్ అక్రమాస్తులపై సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్‌పై.. వైసీపీ నేతలు ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. చంద్రబాబుపై 26కు పైగా విచారణలు జరిపించినా.. ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అటువంటి తప్పుడు ఆరోపణలనే చేస్తున్నారన్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!