మసూద్ మరణంపై కొనసాగుతున్న సస్పెన్షన్
పుల్వామా దాడుల సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ చచ్చాడా..? లేదా..? అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మసూద్ అజార్ చనిపోయాడని పాకిస్థాన్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాక్ ప్రభుత్వ కొత్త నాటకంలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పుల్వామా దాడులపై విచారణను పక్కదారి పట్టించేందుకే ఇమ్రాన్ ప్రభుత్వం కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జైషే వర్గాలు మాత్రం అజర్ బతికే ఉన్నాడని అంటున్నాయి. రావల్పిండిలోని […]

పుల్వామా దాడుల సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ చచ్చాడా..? లేదా..? అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మసూద్ అజార్ చనిపోయాడని పాకిస్థాన్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాక్ ప్రభుత్వ కొత్త నాటకంలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పుల్వామా దాడులపై విచారణను పక్కదారి పట్టించేందుకే ఇమ్రాన్ ప్రభుత్వం కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే జైషే వర్గాలు మాత్రం అజర్ బతికే ఉన్నాడని అంటున్నాయి. రావల్పిండిలోని పాక్ మిలిటరీ ఆసుపత్రిలో ఈ టెర్రర్ నేతకు చాలా రోజుల నుంచి చికిత్స జరుగుతోంది. మరోవైపు మసూద్ అజర్ చచ్చినా, బతికి ఉన్నా తమకు సంబంధం లేదని, పుల్వామా దాడిలో జైషే ఉగ్రవాద సంస్థ ప్రమేయంపై మాత్రం విచారణ కొనసాగుతోందని కేంద్రం ప్రకటించింది. మరోవైపు మసూద్ చనిపోయినట్లు ఖచ్చితమైన సమాచారం లేదని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి మసూద్ మరణంపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.



