కేసీఆర్‌పై సోషల్ మీడియా పోస్ట్: కేసు నమోదు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఆదివారం కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తామూ హిందువులమేనని, బీజేపీ ఒక్కటే హిందువలనుకుంటూ భ్రమ పడుతోందని విమర్శించారు. కేసీఆర్ చేసిన హిందూ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సాయికుమార్ అనే వ్యక్తి టిక్‌టాక్‌లో వీడియో చేసి పెట్టాడు. అతనిపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

కేసీఆర్‌పై సోషల్ మీడియా పోస్ట్: కేసు నమోదు
Follow us
Vijay K

|

Updated on: Mar 21, 2019 | 11:33 AM

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఆదివారం కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తామూ హిందువులమేనని, బీజేపీ ఒక్కటే హిందువలనుకుంటూ భ్రమ పడుతోందని విమర్శించారు.

కేసీఆర్ చేసిన హిందూ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సాయికుమార్ అనే వ్యక్తి టిక్‌టాక్‌లో వీడియో చేసి పెట్టాడు. అతనిపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌లో తాను చేసిన కామెంట్లకు బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని, తాను మాట్లాడిన దానిలో తప్పేముందని కేసీఆర్ అంతకుముందు ప్రశ్నించారు.