Siezed money belongs to BJP Candidate: ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలో ధన ప్రవాహం పోటెత్తే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారుల్లోని శామీర్‌పేట వద్ద సోమవారం సాయంత్రం తనిఖీల్లో దొరికిన 40 లక్షల రూపాయలు దుబ్బాక బరిలో నిలిచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావువేనని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికలో డబ్బులను వెచ్చించేందుకు రాజకీయ పార్టీలు వెనుకాడే పరిస్థితి లేదని తెలుస్తోంది.
సోమవారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో శామీర్‌పేట వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు క్రెటా కారులో 40 లక్షల రూపాయల నగదు దొరికింది. డబ్బును తరలిస్తున్న వెహికిల్ డ్రైవర్, మరో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించిన మీదట ఆ 40 లక్షల రూపాయలు బీజేపీ తరపున దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన రఘునందన్ రావుకు సంబంధించినవి అని పోలీసులు గుర్తించారని బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి వెల్లడించారు.
‘‘ నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో క్రెటా కారులో 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము.. ఆ డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చెందిన సొమ్ము.. డబ్బులతో పారిపోతుండగా పెట్టుకున్నాము .. పటాన్‌చెరు నుంచి డబ్బును సిద్దిపేటకు తరలిస్తున్నారు.. మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాము.. ’’ అని పద్మజారెడ్డి మంగళవారం సాయంత్రం వెల్లడించారు.
Also read: అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం
Also read: తెలంగాణకు వెదర్ వార్నింగ్.. రెండ్రోజులు..!
Also read: అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి
Also read: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్
Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ