వాటిని శాకాహారంగా గుర్తించండి.. శివసేన ఎంపీ సంజయ్ వ్యాఖ్య
ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తలో నిలిచే శివసేన ఎంపీ సంజయ్ రైత్ తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. చికెన్, కోడిగుడ్లను శాఖాహారంగా గుర్తించాలని దీనికోసం ఆయుష్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఆదివాసీలు ఆయుర్వేదిక్ చికెన్ తింటారని, అది తినడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని తనకు చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. చౌదరి చరణ్‌సింగ్ […]
ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తలో నిలిచే శివసేన ఎంపీ సంజయ్ రైత్ తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. చికెన్, కోడిగుడ్లను శాఖాహారంగా గుర్తించాలని దీనికోసం ఆయుష్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఆదివాసీలు ఆయుర్వేదిక్ చికెన్ తింటారని, అది తినడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని తనకు చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. చౌదరి చరణ్‌సింగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు దీనిపై పరిశోధనలు సైతం చేస్తున్నరంటూ చెప్పుకొచ్చారు.
ఆయుర్వేదిక్ మందులు తినే కోడి, అదిపెట్టే గుడ్లు కూడా ఆయుర్వేదిక్ కాబట్టి శాకాహారులు సైతం వీటిని తినేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయుర్వేదానికి ఎంతో ప్రాధన్యాత కల్పిస్తున్న ఆయుష్ శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కనీసం రూ.10వేల కోట్లు పెంచాలని సంజయ్ డిమాండ్ చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యాలకు రెస్పాన్స్ మాత్రం ఊహించని స్ధాయిలో వస్తోంది. పలువురు నెటిజన్లు ఈ విషయంపై సెటైర్లు వేస్తున్నారు. చికెన్,కోడిగుడ్లు ఆయుర్వేదమైతే.. మటన్, బీఫ్ హోమియోపతినా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
మొత్తానికి చికెన్, కోడిగుడ్లను శాఖాహారంగా గుర్తించాలంటూ శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయుష్ శాఖ ఎలా చర్యలు తీసుకుంటుందో మున్ముందు చూడాలి.