Sagar by Election: సాగర్ ఉప ఎన్నిక.. తేలిన సమీకరణాలు.. బీజేపీ అభ్యర్థిగా రవికుమార్.. ఖరారు చేసిన అధిష్టానం

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్‌ పనుగోతు రవి కుమార్‌ను ఖరారు చేసింది.

Sagar by Election: సాగర్ ఉప ఎన్నిక.. తేలిన సమీకరణాలు.. బీజేపీ అభ్యర్థిగా రవికుమార్.. ఖరారు చేసిన అధిష్టానం
Follow us
Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Updated on: Mar 30, 2021 | 6:08 AM

Sagar bjp candidate:  ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చింది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్‌ పనుగోతు రవి కుమార్‌ను తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన బీజేపీ టికెట్ ఎట్టకేలకు రవి కుమార్‌ను వరించింది.

బీజేపీ నుంచి అంజయ్య యాదవ్‌, కంకనాల నివేదితా రెడ్డి కూడా టికెట్‌ ఆశించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నివేదితా.. టికెట్‌ వస్తుందనే ఆశాభావంతో ఇప్పటికే నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే, ఈ ఉప ఎన్నికకు అనుహ్యంగా అధిష్టానం రవికుమార్ పేరును ఖరారు చేసింది.

ఇదిలావుంటే, టీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై అచితూచి వ్యవహరించింది. మొదటి నుంచి గోప్యంగా ఉంచి.. చివరికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కు ఆ పార్టీ టికెట్‌ ఖరారు చేసింది. ఈ నేపథ్యంతో సామాజిక సమీకరణాల ఆధారంగా పనుగోతు రవికుమార్‌ను బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్‌ పత్రాలను నిడమనూరు ఆర్వో కార్యాలయంలో అందజేయనున్నారు.

Read Also…  ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?