Revanth Reddy fixed: భూదందాలో రేవంత్… ఆర్డీఓ రిపోర్టులో తేలిందిదే!
అనుకున్నదే అయ్యింది. రేవంత్ రెడ్డిపై వచ్చిన భూదందా ఆరోపణలు నిజమని అధికార యంత్రాంగం తేల్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రేవంత్, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిల భూ దందాపై...
RDO report clearly says Revanth Reddy is a cuprit: అనుకున్నదే అయ్యింది. రేవంత్ రెడ్డిపై వచ్చిన భూదందా ఆరోపణలు నిజమని అధికార యంత్రాంగం తేల్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రేవంత్, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిల భూ దందాపై ఆర్డీఓ విచారణ పూర్తి అయ్యింది. ఆర్డీఓ తమ నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆ నివేదికను టీవీ9 సంపాదించింది.
రేవంత్ రెడ్డి సోదరులు హైదరాబాద్ శివారుల్లోని గోపన్‌పల్లిలో భూ దందాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ గత వారం రోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ నిరాధారాలని, తనపై అధికార పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు ఫ్రేమ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు జరిపారు. ఆర్డీఓ చంద్రకళ.. భూదందాలపై దర్యాప్తు జరిపి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.
టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి అక్రమాల నివేదిక
రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తి చేశారు. ప్రభుత్వ విచారణలో అడ్డంగా రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూ దందాలపై అధికారులు ఆధారాలు సంపాదించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు ఆర్డీవో చంద్రకళ. వాల్టా చట్టం ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీఓ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా కట్టుకున్న గోడలను కూల్చివేయాలని నివేదికలో పేర్కొన్న ఆర్డీవో.. దానికి తగిన సాక్ష్యాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సర్వే నెంబర్ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలు వాల్టాచట్టం ఉల్లంఘించినట్టు సాక్షాలతో తేల్చిన అధికారులు.. సర్వే నెంబర్ 127 లోనే 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్టు గుర్తించారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఆధీనంలో ఉన్న.. 10.20 ఎకరాలు అక్రమం అని తేల్చారు. గోపన్‌పల్లి సర్వే నెంబర్ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్ రెడ్డి.. అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్టు గుర్తించిన రెవెన్యూ అధికారులు… దానిపై నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎకరం 36 గుంటల భూమిని.. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి అక్రమంగా మ్యూటేషన్ చేయించుకున్నారని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలపై.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదికలో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Also read: ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి.. కేసేంటంటే? Revanth Reddy appeared before ACB court