కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత వేగంతో ప్రయాణిస్తున్న కారు వేగం అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ...

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 04, 2020 | 8:51 AM

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత వేగంతో ప్రయాణిస్తున్న కారు వేగం అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

జిల్లాలోని మత్సపురి గ్రామానికి చెందిన చిట్టయ్య, కాశీ, కాజ అనే ముగ్గురు వ్యక్తులు రొయ్యసాగు చేస్తుంటారు. రొయ్యల సీడ్ కోసం ఉదయాన్నే షీఫ్ట్ కారులో ఇంటి నుంచి బయల్దేరారు. పోడూరు మండలం జగన్నాధపురం వంతెన వద్దకు రాగానే కారు కాల్వలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జి మీద నుంచి కాల్వలోకి కారు పల్టీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మ‌ృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కారును వెలికి తీశారు. ఉదయం సమయంలో మంచు ఎక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.