క‌రోనా ట్రేసింగ్ : స‌గం ర్యాపిడ్ కిట్ల ద్వారానే

భారతదేశంలో నిర్వహించిన మొత్తం వివిధ రకాల కోవిడ్ -19 పరీక్షలు ఆదివారం 2 కోట్ల మార్కును దాటాయి. యాంటిజెన్ కిట్లు ఉప‌యోగిస్తుండ‌టంతో ప‌రీక్ష‌లు వేగం భారీగా పెరిగింది.

క‌రోనా ట్రేసింగ్ : స‌గం ర్యాపిడ్ కిట్ల ద్వారానే

Corona Tests In India : భారతదేశంలో నిర్వహించిన మొత్తం వివిధ రకాల కోవిడ్ -19 పరీక్షలు ఆదివారం 2 కోట్ల మార్కును దాటాయి. యాంటిజెన్ కిట్లు ఉప‌యోగిస్తుండ‌టంతో ప‌రీక్ష‌లు వేగం భారీగా పెరిగింది. వ్యాధి నిర్దార‌ణ కూడా సుల‌భ‌త‌రంగా మారింది. వ్యాధి గ్ర‌స్తుల‌ను వేగంగా గుర్తించ‌డానికి, వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల‌లో త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోడానికి, కాంటాక్ట్ కేసులు త‌గ్గించ‌డానికి యాంటిజెన్ కిట్లు బాగా ఉప‌యోగ‌పడుతున్నాయి. కాగా యాంటిజెన్ కిట్ల ద్వారా చేసిన టెస్టుల విష‌యంలో  కొన్ని ఫ‌లితాల త‌ప్పుల‌పై ఐసీఎమ్ఆర్ ఇప్పుడు ఫోక‌స్ పెట్టింది. కాగా నెల‌లో రోజువారి కోవిడ్-19 టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అందునా జూలై చివరి నాటికి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ వాడ‌క 40 నుంచి 45% పెరిగింది. జూలై మొదటి వారంలో రోజుకు యావ‌రేజ్ గా 2,40,620 టెస్టులు చేయ‌గా.. జూలై చివరి వారంలో ఆ సంఖ్య‌ 4,68,263 కు పెరిగింది. జులై చివ‌రి వారంలో 5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించిన రోజులు ఉన్నాయి. జూలై 30 న 24 గంటల్లో ఏకంగా 6.43 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో 45.68% ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా చేసిన‌వే ఉన్నాయి.

కాగా ఐసీఎంఆర్ శాస్త్రీయ ప‌ద్ద‌తుల ద్వారా వేగవంతమైన యాంటిజెన్ పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తుంది. అనుమానం వ‌స్తే ఎప్ప‌టిక‌ప్పుడు ఫ‌లితాల‌ను క్రాస్ చెక్ చేస్తోంది. వ్యాధి సింట‌మ్స్ ఉన్న‌ప్ప‌టికీ నెగ‌టివ్ అని ఎక్కువ‌గా కేసుల విష‌యంలో వ‌స్తే…ఈ టెస్టింగ్ విధానాన్ని విశ్లేషించే అవ‌కాశాలు ఉన్నాయి.

 

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

Click on your DTH Provider to Add TV9 Telugu