మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..!

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీనికి కూడా కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా కూడా రెట్టింపు అవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, సెలబ్రేటీలు, రాజకీయనాయకులు సైతం మహమ్మారి ధాటికి గురవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 04, 2020 | 8:56 PM

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీనికి కూడా కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా కూడా రెట్టింపు అవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, సెలబ్రేటీలు, రాజకీయనాయకులు సైతం మహమ్మారి ధాటికి గురవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కరోనా బారినపడ్డారు. ఆయన కూడా ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కరోనా వైరస్ సోకి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్నాటక ముఖ్యమంత్రి యడీయూరప్ప, తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ తో పాటు పలు రాష్ట్రా ముఖ్యమంత్రులు సైతం హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దేశంలో కరోనా ఉధృతి మాత్రం తగ్గడంలేదు. ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 18 లక్షలు దాటిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.