వైసీపీ ప్రోద్బలంతోనే నాపై ఐటీ దాడులు: పుట్టా సుధాకర్ యాదవ్

వైసీపీ నేతల ప్రోద్బలంతోనే తమపై ఐటీ దాడులు చేశారని మైదుకూరు టీడీపీ అభ్యర్థి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. కడప జిల్లాలో టీడీపీ పుంజుకుంటోందని, వైసీపీ పతనం అవుతోందని.. అందుకే కుట్ర పన్ని తమపై ఐటీ దాడులు చేయించారని ఆయన అన్నారు. అయినా ఇలాంటి దాడులకు తాము భయపడమని.. ఆస్తులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ […]

వైసీపీ ప్రోద్బలంతోనే నాపై ఐటీ దాడులు: పుట్టా సుధాకర్ యాదవ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 04, 2019 | 11:38 AM

వైసీపీ నేతల ప్రోద్బలంతోనే తమపై ఐటీ దాడులు చేశారని మైదుకూరు టీడీపీ అభ్యర్థి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. కడప జిల్లాలో టీడీపీ పుంజుకుంటోందని, వైసీపీ పతనం అవుతోందని.. అందుకే కుట్ర పన్ని తమపై ఐటీ దాడులు చేయించారని ఆయన అన్నారు. అయినా ఇలాంటి దాడులకు తాము భయపడమని.. ఆస్తులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.

అయితే బుధవారం మధ్యాహ్నం పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన ప్రచారంలో ఉండగా.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, పుట్టా నివాసానికి చేరుకున్నారు. నేరుగా అధికారులు తనిఖీలు చేసే గదికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.