టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

కృష్ణా : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. తనకు ప్రభుత్వ రక్షణ వద్దని.. ప్రైవేటు భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో […]

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 03, 2019 | 7:17 PM

కృష్ణా : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. తనకు ప్రభుత్వ రక్షణ వద్దని.. ప్రైవేటు భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో తాజాగా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందని.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని వంశీ ఆరోపించారు.