బ్రేకింగ్.. బండ్ల గణేష్ అరెస్ట్‌లో ట్విస్ట్.. అసలు కేసు వేరే..!

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత పీవీపీకి సంబంధించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారని అంతా అనుకున్నారు. అయితే అసలు బండ్ల గణేష్ అరెస్ట్‌కు.. పీవీపీ కేసుకు సంబంధం లేదట. అసలు కేసు మరొకటి ఉంది. వివరాల్లోకి వెళితే.. బండ్ల గణేష్‌పై ఏపీలో మరో కేసు నమోదైంది. ఆ కేసు కూడా ఫైనాన్షియల్ మ్యాటరే‌. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర […]

  • Updated On - 11:07 pm, Wed, 23 October 19 Edited By:
బ్రేకింగ్.. బండ్ల గణేష్ అరెస్ట్‌లో ట్విస్ట్.. అసలు కేసు వేరే..!

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత పీవీపీకి సంబంధించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారని అంతా అనుకున్నారు. అయితే అసలు బండ్ల గణేష్ అరెస్ట్‌కు.. పీవీపీ కేసుకు సంబంధం లేదట. అసలు కేసు మరొకటి ఉంది.

వివరాల్లోకి వెళితే.. బండ్ల గణేష్‌పై ఏపీలో మరో కేసు నమోదైంది. ఆ కేసు కూడా ఫైనాన్షియల్ మ్యాటరే‌. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్‌పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కోర్టు విచారణకు బండ్ల గణేష్ హాజరు కాకపోవడంతో..  ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కడప మెజిస్ట్రేట్. దీంతో బంజారాహిల్స్ పోలీసులు.. బండ్ల గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపర్చనున్నారు.

కాగా, నిర్మాత పీవీపీ ఫిర్యాదుతో బండ్ల గణేశ్‌పై ఈ నెల 5న జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ తన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి చెల్లించలేదని..తన ఇంటిపై మనుషులను పంపి బెదిరించారని పీవీపీ ఫిర్యాదు చేశారు. దీంతో బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420,448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.