అనుష్కతో రిలేషన్, పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్.. ఏమన్నాడంటే.. !
టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఈ మధ్యన మళ్లీ హల్‌చల్ చేశాయి. అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ మనువాడనున్నాడని.. సాహో విడుదల తరువాత వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు పుకార్లు గుప్పమన్నాయి. వీటిపై తాజాగా స్పందించాడు డార్లింగ్. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని ప్రభాస్ కొట్టిపారేశాడు. అలాగే అనుష్కతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని అతడు మరోమారు స్పష్టం చేశాడు. కాగా సుజీత్ దర్శకత్వంలో […]
టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఈ మధ్యన మళ్లీ హల్‌చల్ చేశాయి. అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ మనువాడనున్నాడని.. సాహో విడుదల తరువాత వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు పుకార్లు గుప్పమన్నాయి. వీటిపై తాజాగా స్పందించాడు డార్లింగ్.
తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని ప్రభాస్ కొట్టిపారేశాడు. అలాగే అనుష్కతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని అతడు మరోమారు స్పష్టం చేశాడు. కాగా సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు ప్రభాస్. తెలుగు, తమిళం, హిందీలో రాబోతున్న ఈ చిత్రం కోసం ఆయా భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
కాగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలలో నటించారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.