బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక… సీనియర్ ఐపీఎస్…!
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ విక్రమ్ కపూర్ తన కింది స్థాయి ఉద్యోగుల బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన గదిలోకి పరుగెత్తి చూడగా… రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను గమనించారు. ఢిల్లీలోని ఫరిదాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే ఆయన సూసైడ్ నోట్‌లో ఇద్దరు పోలీసుల పేర్లు పేర్కొన్నట్లు సమాచారం. అబ్దుల్ సయీద్ అనే […]
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ విక్రమ్ కపూర్ తన కింది స్థాయి ఉద్యోగుల బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన గదిలోకి పరుగెత్తి చూడగా… రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను గమనించారు. ఢిల్లీలోని ఫరిదాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే ఆయన సూసైడ్ నోట్‌లో ఇద్దరు పోలీసుల పేర్లు పేర్కొన్నట్లు సమాచారం. అబ్దుల్ సయీద్ అనే పోలీసు ఉద్యోగితో పాటు మరో పోలీసు ఉద్యోగి పేరు కూడా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఈ ఇద్దరు వ్యక్తులు ఆయన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కుటుం సభ్యులు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.