AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టుబడ్డ దొంగనోట్ల తయారీ ముఠా

హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ ముఠా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరుముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. తలాబ్ కట్టలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. గౌస్ తో పాటుగా రబీబుల్ షేక్ ను అరెస్ట్ చేశారు. మహ్మద్ గౌస్, రబీబుల్ షేక్ నుంచి 3,98000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ గౌస్ పై చాంద్రాయణగుట్ట పీఎస్ […]

పట్టుబడ్డ దొంగనోట్ల తయారీ ముఠా
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 16, 2019 | 1:10 PM

Share

హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ ముఠా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరుముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. తలాబ్ కట్టలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. గౌస్ తో పాటుగా రబీబుల్ షేక్ ను అరెస్ట్ చేశారు. మహ్మద్ గౌస్, రబీబుల్ షేక్ నుంచి 3,98000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ గౌస్ పై చాంద్రాయణగుట్ట పీఎస్ లో రౌడీషీట్ ఉందని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రబీబుల్ షేక్, అమీనుల్ రెహ్మన్ తో కలిసి నకిలీ నోట్లను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us