పార్టీ మారడంపై స్పష్టతనిచ్చిన మంత్రి అఖిల ప్రియ

పార్టీలు మారుతున్న జంప్ జిలానీలపై మంత్రి భూమా అఖిలప్రియ సెటైర్లు వేశారు. ఎలక్షన్స్ లో సీట్లు రావు అని అభిప్రాయపడే వారు మాత్రమే పార్టీలు మారుతారని ఆమె అన్నారు. కాగా.. మంత్రులు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుండటంతో దానిపై కూడా ఆమె స్పందించారు. మంత్రులు ఎవరూ పార్టీలు మారబోమని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు అఖిల ప్రియ. సీఎం చంద్రబాబు ఏపీలో చేపట్టిన అభివృద్ధినే ప్రజల్లోకి తీసుకెళ్లి […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:26 pm, Sat, 16 February 19
పార్టీ మారడంపై స్పష్టతనిచ్చిన మంత్రి అఖిల ప్రియ

పార్టీలు మారుతున్న జంప్ జిలానీలపై మంత్రి భూమా అఖిలప్రియ సెటైర్లు వేశారు. ఎలక్షన్స్ లో సీట్లు రావు అని అభిప్రాయపడే వారు మాత్రమే పార్టీలు మారుతారని ఆమె అన్నారు. కాగా.. మంత్రులు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుండటంతో దానిపై కూడా ఆమె స్పందించారు. మంత్రులు ఎవరూ పార్టీలు మారబోమని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు అఖిల ప్రియ. సీఎం చంద్రబాబు ఏపీలో చేపట్టిన అభివృద్ధినే ప్రజల్లోకి తీసుకెళ్లి ధైర్యంగా ఓట్లు అడిగే సత్తా మాకుందని తెలిపారు. టికెట్ల విషయంలో సీఎం నిర్ణయాన్నే మేము పాటిస్తామని అన్నారు. తమ సీట్లపై తమకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అఖిల ప్రియ. కాగా.. ఈ రోజు ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.