ఔటర్ రింగ్ రోడ్ పై కాలి బూడిదైన కారు

ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కారు కాలి బూడిదైంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ కారు నుంచి మంటలు చెలరేగడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పెద్ద పేలుడుతో ఇంజన్ నుంచి మంటలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమయానికి కారు డోర్లు తెరుచుకోకపోవడంతో.. కారు నడుపుతున్న వ్యక్తి బయటకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:06 am, Thu, 21 February 19
ఔటర్ రింగ్ రోడ్ పై కాలి బూడిదైన కారు

ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కారు కాలి బూడిదైంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ కారు నుంచి మంటలు చెలరేగడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పెద్ద పేలుడుతో ఇంజన్ నుంచి మంటలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమయానికి కారు డోర్లు తెరుచుకోకపోవడంతో.. కారు నడుపుతున్న వ్యక్తి బయటకు రాలేకపోయారని అంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినా.. ఫలితం లేకపోయింది.