సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాల్సిందే..
ఒరిస్సాలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, చిన్నపిల్లలు తప్పిపోతున్న ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రస్ధాయిలో అక్కడి ప్రభుత్వాన్ని నిలదీశాయి. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ అధికార బిజూ జనతాదళ్ పాలనపై ఆరోపణలు చేశాయి. ప్రతిపక్షనేత ప్రదీప్త కుమార్ నాయక్ మాట్లాడుతూ చిన్నపిల్లలు అదృశ్యం కావడానికి, అత్యాచార ఘటనలు జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన […]
ఒరిస్సాలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, చిన్నపిల్లలు తప్పిపోతున్న ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రస్ధాయిలో అక్కడి ప్రభుత్వాన్ని నిలదీశాయి. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ అధికార బిజూ జనతాదళ్ పాలనపై ఆరోపణలు చేశాయి. ప్రతిపక్షనేత ప్రదీప్త కుమార్ నాయక్ మాట్లాడుతూ చిన్నపిల్లలు అదృశ్యం కావడానికి, అత్యాచార ఘటనలు జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు ఆరువేల మంది చిన్నారులు అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రదీప్త కుమార్. ఈ చిన్నారులతో అవయవ వ్యాపారం జరుగుతున్నట్టుగా అనుమానాలున్నాయన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు ముఖ్యమంత్రి నవీన్ సమాధానమిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని,ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నామని స్పష్టం చేశారు.