టీవీ9 ‘ఆపరేషన్‌ చార్లి’ ఎఫెక్ట్, సీటీలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లోనూ ఇంకా డ్రగ్‌ జాడలున్నాయా? హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ కోసం ఎవరు ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ..ఎలా డ్రగ్స్‌ తెస్తున్నారు?..

టీవీ9 'ఆపరేషన్‌ చార్లి' ఎఫెక్ట్, సీటీలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 20, 2020 | 4:33 PM

హైదరాబాద్‌లోనూ ఇంకా డ్రగ్‌ జాడలున్నాయా? హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ కోసం ఎవరు ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ..ఎలా డ్రగ్స్‌ తెస్తున్నారు?..ఈ అంశంపై టీవీ9 ఆపరేషన్‌ చార్లి రూపంలో మీడియా చరిత్రలోనే సంచలన స్టింగ్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైదారాబాద్‌లో డ్రగ్ రాకెట్టు గుట్టు కదులుతోంది. తాజాగా నగరంలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. లంగర్ హౌస్‌లో నైజీరియన్ దగ్గర 6 గ్రాములు కొకెయిన్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు, గోవాల నుంచి అతడు హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. టీవీ 9 సాహసోపేతమైన ఆపరేషన్ తర్వాత పలువురు నైజీరియన్లు , డ్రగ్ పెడ్లర్లపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్  పోలీసులు నిఘా ఉంచారు.  రాజేంద్రనగర్ సన్ సిటీ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న డానియల్ అనే వ్యక్తిని కూడా  వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read :

డబ్బులు లేక మూడు రోజుల తర్వాత అమ్మ అంత్యక్రియలు

టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్