డబ్బులు లేక మూడు రోజుల తర్వాత అమ్మ అంత్యక్రియలు
అమ్మ..మనకు రూపం ఇచ్చిన మనిషి..మనకు నడత, నడక నేర్పిన వ్యక్తి. ఈ ప్రపంచంలోకి అడుకుపెట్టకముందే మనల్ని అమితంగా ప్రేమించిన దైవస్వరూపం.
అమ్మ..మనకు రూపం ఇచ్చిన మనిషి..మనకు నడత, నడక నేర్పిన వ్యక్తి. ఈ ప్రపంచంలోకి అడుకుపెట్టకముందే మనల్ని అమితంగా ప్రేమించిన దైవస్వరూపం అమ్మ. అలాంటి అమ్మకు చనిపోయాక అంతిమ సంస్కారాలు చెయ్యడానికి ఇద్దరు కొడుకులు 3 రోజులు ఎదురుచూశాడంటే మనం ఏ సమాజంలో, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటక బెల్గాంకు చెందిన భారతి బస్తవద్కర్ అనే మహిళ అంతమసంస్కారాలు చేయడానికి ఆమె కుమారులకు ఏకంగా మూడు రోజుల సమయం పట్టింది. అనారోగ్యం కారణంగా భారతి ఈ నెల 16న బిమ్స్ హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక తుదిశ్వాస విడిచింది.
కరోనా లాక్డౌన్ కారణంగా ఆమె కుమారులు ఇరువురూ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆసుపత్రికి ఫీజు చెల్లించలేకపోయారు. తెలిసిన వారి దగ్గర అడిగినా ఫలితం దక్కలేదు. మొత్తం చెల్లిస్తేనే డెడ్‌బాడీని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో ఆ తల్లి కన్నబిడ్డలు మూడు రోజుల పాటు వేచి చూశారు.ఈ తరుణంలో అన్నదమ్ముల బాధను గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ సాయం చేసింది. చివరకు మూడు రోజుల తర్వాత దహన సంస్కారాలు చేశారు.
Also Read :