IPL 2020 : CSK vs RR : చెన్నైపై రాజస్థాన్ ఘనవిజయం
ఐపీఎల్-2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కీలక సమయంలో సత్తా చాటింది. ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాల్సిన సమయంలో బిగ్ ఫైట్ చేసింది.
ఐపీఎల్-2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కీలక సమయంలో సత్తా చాటింది. ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాల్సిన సమయంలో బిగ్ ఫైట్ చేసింది. జోస్ బట్లర్(70 నాటౌట్: 48 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్బుత ఆటతీరుతో హాఫ్ సెంచరీ చేయడంతో అలవోకగా చెన్నైపై విజయాన్ని అందుకుంది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆరంభంలో రాజస్థాన్‌ను కట్టడి చేసిన చెన్నై బౌలర్లు బట్లర్‌ను ఏ దశలోనూ నిలువరించలేకపోయారు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశాడు.
126 పరుగుల ఛేదన కోసం బరిలో దిగిన రాజస్థాన్ జట్టులో బట్లర్‌కు తోడు స్టీవ్ స్మిత్(26 నాటౌట్: 34 బంతుల్లో 2ఫోర్లు) మంచి ప్రదర్శన చేశాడు. దీంతో 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయిన చెన్నై మరో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ జడేజా(35: 30 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(28: 28 బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ అయినా చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(1/20), కార్తీక్ త్యాగీ(1/35), శ్రేయాస్ గోపాల్(1/14), రాహుల్ తెవాటియా(1/18) తలో వికెట్ పడగొట్టారు.