కొవిడ్ టీకా ధర నిర్ధారించిన చైనా..!
ప్రపంచానికి కరోనాను అంటగట్టిన చైనాయే దాని విరుగుడికి మందు కనిపెట్టినట్లు ప్రకటించుకుంది. అంతేకాదు దాన్ని వినియోగించేందుకు ధరను కూడా నిర్ధారించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసి కోరల నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ లోకానికి కరోనాను అంటగట్టిన చైనాయే దాని విరుగుడికి మందు కనిపెట్టినట్లు ప్రకటించుకుంది. అంతేకాదు దాన్ని వినియోగించేందుకు ధరను కూడా నిర్ధారించారు.
చైనా దేశంలో ఫ్రంట్‌లైన్ వారియర్లు, కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయ కార్యక్రమంలో భాగంగా సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను రెండు మోతాదులకు కలిపి 60 డాలర్లు అంటే దాదాపు రూ.4,400 గా నిర్ధారించారు. ఈ విషయాన్ని జియాక్సింగ్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనావాక్ అని పిలిచే ఈటీకాను రెండు మోతాదులు ఇస్తున్నట్లు తెలిపింది. ఒక్కో డోస్‌కు 200 యువాన్లు (29.75డాలర్లు) ఖర్చవుతుందని వెల్లడించింది. వైద్య నిపుణులతో సహా కొవిడ్ ముప్పు ఎక్కువున్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే, చైనా అధికారులు ఇప్పటివరకూ కొవిడ్-19 వ్యాక్సిన్ల ధర వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు. జూలైలో ప్రారంభించిన అత్యవసర టీకాల కార్యక్రమంలో భాగంగా లక్షలాది మందికి చివరి దశ ట్రయల్స్‌లో ప్రయోగాత్మక టీకాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న టీకా ధరలో సబ్సిడీ గురించి మాత్రం ఎక్కడ స్పందించలేదు. దీనిపై స్పందించడానికి సీడీసీ నిరాకరించినట్లు సమాచారం.