ప్రేమతో కాదు.. పగ తీర్చుకోవాలనే అలా చేశాడు..!

వరంగల్ హన్మకొండలో ఉన్మాది చేతిలో దాడికి గురైన రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మూడో రోజు కూడా ఐసీయూలోనే రవళికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. 70 శాతం కాలిన గాయాలతో రవళి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం రవళి చికిత్సకు స్పందిస్తున్నా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురంకు చెందిన రవళి.. హన్మకొండలోని వాగ్దేవి […]

ప్రేమతో కాదు.. పగ తీర్చుకోవాలనే అలా చేశాడు..!
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2019 | 3:01 PM

వరంగల్ హన్మకొండలో ఉన్మాది చేతిలో దాడికి గురైన రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మూడో రోజు కూడా ఐసీయూలోనే రవళికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. 70 శాతం కాలిన గాయాలతో రవళి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం రవళి చికిత్సకు స్పందిస్తున్నా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురంకు చెందిన రవళి.. హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజీ వెనకవైపు ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. రవళి తన స్నేహితురాలితో కలిసి వస్తున్న సమయంలో అవినాష్ దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే.. రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నడుచుకుంటూ వెళ్తున్న రవళిని వెనక నుంచి వచ్చిన అవినాష్ ఒక్కసారిగా నెట్టివేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. మొదట చేతులతో దెబ్బలు కొట్టి.. ఆ తర్వాత తనతో తెచ్చిన పెట్రోల్ ను ఆమెపై పోశాడు. అక్కడ ఉన్నవారు తేరుకునే లోపుగానే అగ్గిపుల్ల గీసి అంటించాడు. క్షణాల్లో మంటలు అంటుకుని రవళి తీవ్ర గాయాలైంది. రవళిపై దాడిచేసి పారిపోతున్న అవినాష్‌ను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన అవినాష్.. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రవళి.. ఇద్దరూ క్లాస్‌మేట్స్. సంగెంలలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ ఉండగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్టు స్నేహితులు చెబుతున్నారు. డిగ్రీకి వచ్చిన తర్వాత రవళి హన్మకొండలోని వాగ్ధేవి కాలేజీలో చేరింది. అవినాష్ కూడా అదే కాలేజీలో బీకాంలో చేరాడు. అయితే.. డిగ్రీలో వీరి ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోయింది. దీంతో రవళిపై కోపం పెంచుకున్న అవినాష్.. తనతో ఎప్పటిలాగే ప్రేమ కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ కూడా నడిచినట్టు తెలుస్తోంది. రవళిని ఇక వేధించనంటూ గ్రామపెద్దలకు లిఖిత పూర్వకంగా తెలిపారు అవినాష్. అయితే తనను పంచాయతీలో పెట్టటి పరువు తీసిందన్న కోపంతో రగిలిపోతూనే ఉన్నాడు అవినాష్. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో డిగ్రీ అయిపోతుంది. దీంతో రవళి దూరం అవుతుందని భావించి ఈ లోపుగానే పగతీర్చుకోవాలనుకున్నాడు అవినాష్.

రవళిపై దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు అవినాష్ వరంల్ రూరల్ జిల్లా మామునూరు పీఎస్‌లో లొంగిపోయాడు. అవినాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచి, అనంతరం రిమాండ్ కు తరలించారు.