నిజామాబాద్ మార్కెట్ లో స్వచ్ఛందంగా లాక్ డౌన్

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇద్దరు వ్యాపారులు కరోనా బారినపడ్డారు. దీంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయాలని నిజామాబాద్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది.

నిజామాబాద్ మార్కెట్ లో స్వచ్ఛందంగా లాక్ డౌన్
Follow us

|

Updated on: Jul 12, 2020 | 11:14 AM

కరోనా కల్లోలానికి నగరాలు,పట్టణాలు, పల్లెలు విలవిలలాడుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం వైరస్ విస్తరిస్తోంది. ఇది వర్తక, వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇద్దరు వ్యాపారులు కరోనా బారినపడ్డారు. దీంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయాలని నిజామాబాద్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కలెక్టర్‌కు శనివారం సంఘం తరఫున వినతిపత్రం అందించారు. మార్కెట్ లో ఇద్దరు వ్యాపారుల నుంచి వారి కుటుంబసభ్యులకు కూడా కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్ ను లాక్ డౌన్ చేస్తున్నట్లు వ్యాపారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈనెల 13 నుంచి 20 వరకు కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు అసోసియేషన్‌ తెలిపింది. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం, గుమస్తాలతో పాటు రైతులు వస్తుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు ఈ విషయం దృష్టిలో పెట్టుకుేని మార్కెట్ కు రావద్దని సూచించారు వ్యాపారులు.