AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ రైతులతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రైతులతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా కథలాపూర్, మేడిగడ్డ మండలం ప్రాంతాలకు చెందిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు

ఇవాళ రైతులతో సీఎం కేసీఆర్ భేటీ
Balaraju Goud
|

Updated on: Jul 12, 2020 | 10:08 AM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రైతులతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా కథలాపూర్, మేడిగడ్డ మండలం ప్రాంతాలకు చెందిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో నియంత్రిత పంట సాగు, రైతుబంధు, రైతువేదికల నిర్మాణంతో పాటు పలు వ్యవసాయ అంశాలపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఇవాళ రైతులతో భేటీ అవుతున్నారు.

రైతులు తమ సమస్యలపై విస్తృతంగా చర్చించుకోవడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక నిర్మాణం చేపడుతోంది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. ఈ పనులను వేగవంతం చేయాలని నిన్న జరిగిన ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులతో సమావేశమై పంట సాగు దిగుబడితో పాటు మార్కెటింగ్ సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రైతు వేదికలు ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దసరాలోగా వాటి నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని సూచించారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలవుతాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా పలు పంటల సాగు, నీటి వనరులపై చర్చించనున్నట్లు సమాచారం.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్