బిగ్ బ్రేకింగ్: నిర్భయ దోషులకు జనవరి 22న ఉరి
ఏడేళ్ళుగా నానుతున్న నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు శిక్ష విధించే తేదీ ఖరారయ్యింది. సుదీర్ఘ విచారణ తర్వాత మంగళవారం పటియాల కోర్టు న్యాయమూర్తి శిక్ష అమలు తేదీని ఖరారు చేశారు. తేదీని ఖరారు చేసే ముందు న్యాయమూర్తి దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తుది విడతగా వారేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పటియాలా కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వినియోగించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నిర్భయ కేసు దోషులు నలుగురికి ఓకే […]
ఏడేళ్ళుగా నానుతున్న నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు శిక్ష విధించే తేదీ ఖరారయ్యింది. సుదీర్ఘ విచారణ తర్వాత మంగళవారం పటియాల కోర్టు న్యాయమూర్తి శిక్ష అమలు తేదీని ఖరారు చేశారు. తేదీని ఖరారు చేసే ముందు న్యాయమూర్తి దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తుది విడతగా వారేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పటియాలా కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వినియోగించుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నిర్భయ కేసు దోషులు నలుగురికి ఓకే రోజు, ఓకే సారి ఉరి శిక్ష అమలంటూ డెత్ సెంటెన్స్ జారీ చేశారు పటియాలా కోర్టు న్యాయమూర్తి. జనవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఓకేసారి ఉరి శిక్ష వేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు నిర్భయను అత్యంత కిరాతంగా రేప్ చేసి, దారుణంగా హత్య చేసిన ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లను జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో కొత్తగా ఏర్పాటు చేసిన ఉరికంబాలమీద ఉరి తీస్తారు.