ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై దాడి..!
ప్రముఖ వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ కారుపై ఇవాళ ఉదయం కొందరు ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఇక ఈ ఘటనలో ఆయన తలకు గాయం కాగా.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కేరళలోని కొచ్చి ఐజీ ఆఫీస్ ఎదురుగా ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్)కు చెందిన కొందరు వ్యక్తులు ఎండీపై దాడికి తెగబడ్డారని […]
ప్రముఖ వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ కారుపై ఇవాళ ఉదయం కొందరు ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఇక ఈ ఘటనలో ఆయన తలకు గాయం కాగా.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కేరళలోని కొచ్చి ఐజీ ఆఫీస్ ఎదురుగా ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్)కు చెందిన కొందరు వ్యక్తులు ఎండీపై దాడికి తెగబడ్డారని సంస్థ యాజమాన్యం ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలను మాత్రం సీఐటీయూ తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్‌లో ముత్తూట్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా ఉన్న 43 బ్రాంచుల్లో సుమారు 160 మందిని విధుల నుంచి తొలగించారు. దీనితో వారు కొద్దిరోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై జరిగిన దాడిలో సీఐటీయూ నేతల హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.