ఇరాన్ జనరల్ సులేమాన్ అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 32 మంది మృతి !

అమెరికా వైమానిక దాడుల్లో హతుడైన ఇరాన్ జనరల్   అంత్యక్రియలు ఆ దేశంలోని కెర్మాన్ లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా 190 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది.  ఈ సంఘటనను ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హెడ్ పీర్ హుసేన్ కౌలివంద్ ధృవీకరించారు. గాయపడినవారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్టు ఆయన తెలిపారు. కాగా-కెర్మాన్ నగర వీధులన్నీ లక్షలాది సంతాపకారులతో నిండిపోయాయని, అనేకమంది […]

ఇరాన్ జనరల్ సులేమాన్ అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 32 మంది మృతి !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2020 | 5:58 PM

అమెరికా వైమానిక దాడుల్లో హతుడైన ఇరాన్ జనరల్   అంత్యక్రియలు ఆ దేశంలోని కెర్మాన్ లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా 190 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది.  ఈ సంఘటనను ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హెడ్ పీర్ హుసేన్ కౌలివంద్ ధృవీకరించారు. గాయపడినవారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్టు ఆయన తెలిపారు. కాగా-కెర్మాన్ నగర వీధులన్నీ లక్షలాది సంతాపకారులతో నిండిపోయాయని, అనేకమంది కింద పడిపోయి స్పృహ కోల్పోయారని ఇరాన్ టీవీ పేర్కొంది. పలువురు ఈ సిటీ చుట్టుపక్కల గల కొండలపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించింది. ఖాసిం సులేమాన్ మృతిని ఇరానియన్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.