వాట్సాప్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా..!
యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

యూజర్లను ఆకట్టుకోవడంలో ముందుండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో మల్టీ లాగిన్ డివైజ్ సపోర్ట్, సెర్చ్ బై డేట్ ఆప్షన్ ఇలా పలు ఫీచర్లు ఉన్నాయి. వీటి వలన వాట్సాప్ వాడకాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలన్న ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మల్టీ లాగిన్ డివైజ్ సపోర్ట్ ఫీచర్ వలన ఒకేసారి వివిధ డివైజ్‌లలో వాట్సాప్‌ని లాగిన్ అవ్వొచ్చు. ప్రస్తుతం ఒక చోట లాగిన్ అయ్యి మరొకరు లాగిన్ అవ్వాలంటే కచ్చితంగా లాగ్ ఔట్ అవ్వాల్సి ఉండగా.. మల్టీ లాగిన్ డివైజ్ వలన ఆ ఇబ్బంది తొలగనుంది. అలాగే వివిధ డివైజ్‌ల నుంచి ఒకే సమయంలో చాట్ చేసే అవకాశం ఉంటుంది. పలువురు కలిసి పని చేసుకునే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక ‘సెర్చ్ బై డేట్ ఆప్షన్ వలన తేదీ ఆధారంగా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రారంభ దశలోనే ఉందని, అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టొచ్చని డబ్ల్యూఏ బేటా ఇన్ఫో వెల్లడించింది. నిర్ధిష్ట తేదీ ఆధారంగా శోధించే సెర్చ్ బై డేట్ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయబోతోందని తెలిపింది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడింది.
Read This Story Also: 100 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ కన్నుమూత..!



