కేరళలో భారీ అగ్నిప్రమాదం

తిరువనంతపురంలోని హిందుస్తాన్‌ లాటెక్స్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.

  • Balaraju Goud
  • Publish Date - 10:29 pm, Fri, 12 June 20
కేరళలో భారీ అగ్నిప్రమాదం

కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురంలోని హిందుస్తాన్‌ లాటెక్స్‌ లిమిటెడ్(హెచ్‌సీఎల్‌ లైఫ్‌కేర్‌)‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలసు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి కంపెనిలో విస్తరించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి మొదలైన మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదన్న అధికారులు భారీగా అస్తి నష్టం వాట్లిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.