ఆ ఖాతాలన్నింటిని డిలీట్‌ చేసిన ట్విట్టర్‌

సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1.7 లక్షల ట్విట్టర్ ఖాతాలను డిలీట్‌ చేసింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ ప్రకటించింది.

ఆ ఖాతాలన్నింటిని డిలీట్‌ చేసిన ట్విట్టర్‌
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 10:41 PM

సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1.7 లక్షల ట్విట్టర్ ఖాతాలను డిలీట్‌ చేసింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ ప్రకటించింది. సదరు అకౌంట్ హోల్డర్లు చైనా అనుకూల వదంతులను వైరల్ చేస్తున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనాతో పాటుగా.. హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనల విషయంలో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని.. ఈ పోస్టులన్నీ ట్విట్టర్‌ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని.. అందుకే అలాంటి అకౌంట్లన్నింటినిక తొలగించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఈ అకౌంట్లన్ని కూడా.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలంగా ఉంటూ.. ట్విట్టర్ రూల్స్‌కు విరుద్ధంగా పోస్టింగ్స్ చేస్తున్నాయని.. అందుకే వీటిని తొలగించినట్లు స్పష్టం చేసింది.